మే నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మే 4, 11, 18, 25వ తేదీల్లో శనివారం సంద‌ర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5 గంట‌లకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంత‌రం ఆలయంలో ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది. మే 8వ తేదీ అమావాస్య సంద‌ర్భంగా ఆలయంలో ఉదయం 8 గంట‌ల‌కు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం క‌టాక్షించ‌నున్నారు. మే 11వ తేదీన శ్రీ కోదండ‌రామ‌స్వామివారి పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌ నిర్వ‌హిస్తారు. మే 12వ తేదీన శ్రీ కోదండ‌రామ‌స్వామివారి పుష్ప‌యాగం వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.

 

 

మే 23వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉద‌యం 8.30 గంట‌ల‌కు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల ఊరేగి ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మే 29న శ్రీ కోదండ‌రామ‌స్వామివారు అన్న‌మాచార్య క‌ళామందిరంకు వేంచేపు, ఆస్థానం.

 

Tags: Special celebrations at Sri Kodandaramalayam in the month of May

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *