Natyam ad

పుంగనూరులో అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు

పుంగనూరు ముచ్చట్లు:

 

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం నాల్గవ రోజు పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి , విశేష పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు ఆధ్వర్యంలో శ్రీ అష్టలక్ష్మీ అమ్మవార్లను ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శ్రీబోగనంజుండే శ్వరస్వామి ఆలయంలో పార్వతిదేవిని మహాలక్ష్మీ అలంకారం చేసి పూజలు చేశారు. శ్రీవిరూపాక్షి మారెమ్మను దూదితో అలంకరించారు. నాగపాళ్యెంలోని మార్వాడిలు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పెట్టి, నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. శ్రీచాముండేశ్వరి ఆలయంలో అమ్మవారిని, శ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఆలయాల్లో హ్గమాలు నిర్వహించి, అభిషేకాలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Special decorations for Ammavars in Punganur

Post Midle