మైసూరు దసరా వేడుకలకు స్పెషల్ ఫ్లైట్!

Special flight to Mysore Dasara celebrations

Special flight to Mysore Dasara celebrations

Date:06/10/2018
మైసూర్ ముచ్చట్లు:
నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు – మైసూరు హైవే ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా మైసూరు దసరా వేడుకలకు చేరుకోవాలనుకునే పర్యాటకుల కోసం ప్రత్యేక విమానం.
మైసూరు దసరా వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (కేఎస్టీడీసీ) ప్రత్యేక విమానాన్ని అందుబాటులోకి తెస్తోంది. బెంగళూరు, మైసూరులను కలిపే ఈ విమానం టికెట్ ధర రూ.900 మాత్రమే. అక్టోబరు 10 నుంచి 19 వరకు ఈ విమానం అందుబాటులోకి వస్తుంది.
ఈ మేరకు కేఎస్టీడీసీ.. అలియన్స్ ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానం మంగళవారం మినహా అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది. రోజూ బెంగళూరు నుంచి మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరి 3 గంటలకు చేరుతుంది. మైసూర్ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి 4.20 గంటలకు చేరుతుంది. ఈ విమానం టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయి. కర్ణాటక పర్యాటక శాఖ గత రెండేళ్లుగా ఏడు సీటర్ల ఎయిర్‌క్రాఫ్ట్ మాత్రమే నడుపుతోంది.
సంఖ్య పెరగడంతో ఈసారి 72 సీట్ల అలియన్స్ విమానాన్ని నడపనుంది. కేవలం విదేశీ పర్యాటకులే కాకుండా బెంగళూరు నుంచి మైసూర్‌కు వెళ్లాలనుకొనే పర్యాటకులు కూడా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. హైదరాబాద్, చెన్నై రాష్ట్రాల నుంచి మైసూర్ వెళ్లేవారికి ట్రూజెట్ విమానం అందుబాటులో ఉంది. 72 సీట్ల ఈ విమానం మైసూరు – చెన్నై – హైదరాబాద్ మధ్య ఈ విమానాన్ని నడుపుతుంది. ప్రస్తుతం ఈ విమానం టికెట్ ధర రూ.999గా ఉంది. దసరా సమయానికి ధరలు పెరిగే అవకాశాలున్నాయి.
Tags:Special flight to Mysore Dasara celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *