సిజేరియన్‌ కాన్పులపై స్పెషల్‌ ఫోకస్.

– ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా.

 

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ నిఘా పెంచింది. ప్రత్యేకించి నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్న ఆసుపత్రులపై ఫోకస్‌ చేసింది.అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 104 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాలో 8 ఆసుపత్రులకు నోటీసులిచ్చింది. గడచిన ఐదేళ్లలో మూడు ఆసుపత్రుల్లోనే మూడువేల 40 ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించారు.కర్నూలు, వెస్ట్‌ గోదావరి, అనంతపురం, తిరుపతి, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో రాష్ట్రంలోనే ఎక్కువ సిజేరియన్లు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 27వేల 954 C సెక్షన్ ఆపరేషన్లు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆరోపణలను ప్రైవేటు ఆసుపత్రులు ఖండిస్తున్నాయి. రిస్కు ఉన్నవారికే సిజేరియన్‌ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.ఆడిటింగ్‌ పూర్తయ్యాక అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేసే ఆసుపత్రులపై చర్యలకు రెడీ అయ్యింది వైద్యశాఖ. నార్మల్ డెలివరీలు పెంచేందుకు క్యాంపెయిన్ సైతం ప్రారంభించింది.

 

Tags: Special focus on cesarean deliveries.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *