Natyam ad

 భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి–ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

నెల్లూరు  ముచ్చట్లు:

భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మండల కేంద్రమైన మర్రిపాడుకు చెందిన బీసీ కాలనీవాసులు తమకు దశాబ్దాల క్రితం ప్రభుత్వం అందచేసిన సీజెఎఫ్ఎస్ పట్టాలకు పాసు పుస్తకాలు మంజూరు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే అసైన్ మెంట్ కమిటిలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సచివాలయాల్లో గల వాలంటీర్ల పనితీరు ఎలా ఉందంటూ ప్రశ్నించారు.గత ప్రభుత్వ కాలంలో పించను తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారమని, ప్రతి నెల 1వ తేది తెల్లవారే సరికే వాలంటీర్లు తలుపు తట్టి పింఛను అందచేస్తున్నారని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తెలిపారు.నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి  కృషి వల్లే హైలెవల్ కాలువ మంజూరు అయిందని, అభివృద్దిలోకి వస్తే మెట్ట  ప్రాంతమైన మర్రిపాడు డెల్టాను తలపిస్తుందని పేర్కొన్నారు.బీసీ కాలనీవాసులకు జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించడం పట్ల ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Tags: Special focus on solving land problems–Athmakuru MLA Mekapati Vikram Reddy

Leave A Reply

Your email address will not be published.