స్థానిక సంస్థల అభివృద్ది పై ప్రత్యేక దృష్టి  రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

జగిత్యాల   ముచ్చట్లు :

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్దే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, స్థానిక సంస్థల అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పంచాయతి రాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి  ఎర్రబల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సీజనల్ వ్యాధుల నివారణ ,ధరణి, వ్యాక్సినేషన్, తదితర అంశాలపై సీఎస్  మరియు  ఉన్నతాధికారులు బుధవారం జిల్లా కలెక్టర్లు స్థానిక సంస్థలకు కలెక్టర్లు సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో  కాన్పరెన్సులో మంత్రి వరంగల్ నుండి హజరై ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ   పల్లెప్రగతి ప్రారంభం అయి సుమారు ఏడాదిన్న‌ర‌  కావస్తోందని, ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు  కష్టపడి చక్కని ఫలితాలు సాధించామని, అదే  స్పూర్తి నిరంతరం  కొనసాగించాలని మంత్రి అధికారులకు సూచించారు.గ్రామాల్లో ముఖ్యంగా  పచ్చదనం, పరిశుభ్రత ఈ రెండింటి మీదే బాగా దృష్టి సారించాలని,   హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ చాలా కీలకమని,  బ్రతికిన మొక్కల శాతం చాలా జిల్లాలో 85 శాతం కన్నా పై ఉండగా మ‌రి కొన్ని జిల్లాల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారని, . ముఖ్య‌మంత్రి  ఆకస్మిక సందర్శనలు చేయ‌నున్నారని, నిర్ల‌క్ష్యం వ‌హించే వారిపై చ‌ర్య‌లు త‌ప్పవని మంత్రి  హెచ్చరించారు. సీఎం పరిశీలనలో ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్ లో, పట్టణాల్లో, రోడ్డు మధ్యలో,  కూడళ్ళ‌లో చెట్లు ఉంటున్నాయని  తెలిపారు. పరిశుభ్ర‌తలో భాగంగా చాలా చోట్ల చెత్త సేకరణ రోజు వారి జరగటం లేద‌ని తెలుస్తుందని, అందుకే మనకు ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ ఉన్నాక కూడా ఇంకా చెత్త చెదారం లిఫ్టింగ్ చేయక పోవడమనేది  చాలా సీరియస్ అంశామని తెలిపారు. గ్రామ సభలకు యం.పి.ఓ లు, డి.పి.ఓ లు, అడిషనల్ కల్లెక్టర్స్ హాజ‌రు కావాలని  సూచించారు.   వానాకాలంలో వాడకం లేని బోర్ బావులు, పాడుబ‌డ్డ బావులు ఒక్కటి కూడా గ్రామాల్లో ఉండటానికి వీల్లేదని రేపటి వరకు అన్ని పూడ్చేటట్లు చర్యలు తీసుకోవాలని  తెలిపారు.
అడిషనల్ కల్లెక్టర్ల‌కు వాహనాలు స‌మ‌కూర్చి, బ‌డ్జెట్ కేటాయించ‌టం జరిగిందని, దీని ఫలితం కొంచమైన కనపడాలి. ఎక్కువగా గ్రామాల‌ను సంద‌ర్శించాలని మంత్రి సూచించారు   సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు, యం.పి.ఓ ల పై ఫిర్యాదులు ఉంటే షోకాజ్ నోటిసులు జారీ చేసి 15 రోజులలో  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామాలో వైకుంఠదామ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, వాటిని వినియోగంలోకి తీసుకోని  రావాలని, వాటికి   మొక్కలతో కూడిన గ్రీన్ ఫెన్సింగ్  ఏర్పాటు చేయాలని, ఎతైన పూల మొక్కలు నాటాలని మంత్రి సూచించారు.   వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు సమన్వయం సమావేశాలు నిర్వహించుకొని  సీజనల్ వ్యాధులు నియంత్రించడానికి  పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని  మంత్రి ఆదేశించారు. అధికారులు ప్రజా ప్రతినిధులందరి కృషితో ఇప్ప‌టి వ‌ర‌కు పంచాయ‌తీరాజ్ శాఖ‌కు పలు అవార్డులు, అభినంధ‌న‌లు వచ్చాయిని. ఇదే స్పూర్తితో మెరుగైన ఫ‌లితాలు తీసుకోస్తార‌ని ఆశిస్తున్నామని మంత్రి తెలిపారు.

అనంతరం రాష్ట్ర ముఖ్య  కార్యదర్శి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి,  హరితహారం వంటి పలు అంశాల పై సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలో  ఆశించిన మేరకు పురొగతి సాధించడానికి  సీఎం కేసిఆర్ ఇటీవల ప్రగతి భవన్ లో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారని సీఎస్ తెలిపారు.  జిల్లాలో క్షేత్రస్థాయిలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని,  వారికి నూతనంగా  వాహనాలు సైతం అందించామని,  క్షేత్రస్థాయిలో చిన్న చిన్న  సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా వారి వద్ద  రూ.25 లక్షల నిధులను అందుబాటులో ఉంచుతున్నామని సీఎస్ తెలిపారు.
నూతనంగా నిర్మిస్తున్న  సమీకృత కలెక్టరేట్ భవనంలో సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ రూం పక్కనే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రూం మరియు మంత్రులు సీనియర్ ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించడానికి వీలుగా బోర్డ్ రూమ్ లను  ఏర్పాటు చేయాలని  సీఎస్ ఆదేశించారు.
అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతి అధికారులు  నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని,  గ్రామాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి  పల్లె ప్రగతి పురొగతి,  మొక్కల సంరక్షణ వంటి వాటిని పరిశిలించాలని, అవసరమైన గ్రామాలో పల్లె నిద్ర చేసి సమస్యలు తెలుసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

 

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:Special focus on the development of local institutions
State Panchayati Raj and Rural Development Minister Erraballi Dayakar Rao
Chief Secretary to Government Somesh Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *