గిరిపుత్రులకు ప్రత్యేకం

Date:12/06/2019

శ్రీకాకుళం  ముచ్చట్లు:

మారుమూల గిరిజన గ్రామాల్లో నిరుపేద విద్యార్థులకు విద్యావకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మారుమూల గిరిజన గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో విద్యాభ్యాసాన్ని కొనసాగించలేకపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి విద్యాభ్యాసం చేసే సాహసం చేయలేక విద్యకు దూరవుతున్న వారెందరో ఉన్నారు. ఇలాంటి వారికి విద్యావకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏకలవ్వ విద్యాలయాలను జిల్లాలకు గతేడాది మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎ.పి.ట్రైబుల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో మెళియాపుట్టి, భామిని మండలాలకు ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు జరిగే విద్యాభ్యాసం అందించే ఈ పాఠశాలలను గత ఏడాది ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో తొలి ఏడాది 120 మంది విద్యార్థులు 6వ తరగతిని పూర్తి చేసుకున్నారు. త్వరలో ఆయా విద్యార్థుల ఫలితాలను విడుదల కానున్నాయి.

 

 

 

గతేడాది జిల్లాలోని రెండు మండలాలకు ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేశారు. ఆయా ప్రాంతాల్లో నూతన భవనాలను మంజూరు చేస్తూ, నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలను చేపట్టారు. తొలి ఏడాది విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంగా ఆయా పాఠశాలలను పాతపట్నం, సీతంపేట మండల కేంద్రాల్లో వై.టి.సి. భవనాల్లో నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవోదయ, కేంద్రీయ విద్యాలయం తరహాలోనే ఏకలవ్య పాఠశాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. 2018-19 విద్యా సంవత్సరం ప్రారంభించారు. 6 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తరగతులను నిర్వహించనున్నారు. 6వ తరగతిలో ప్రవేశించిన వారు మళ్లీ ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకు అదే పాఠశాలలో కొనసాగుతారు. ఒక్కో తరగతికి 60 మందికి సీట్లును కేటాయించారు. ఇందులో ఇద్దరు జనరల్‌, ఇద్దరు ఎస్సీ, ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించనున్నారు.

 

 

 

 

మిగిలిన 54 మంది కేవలం ఎస్టీలకు మాత్రమే కేటాయించారు. 2018-19 విద్యా సంవత్సరానిగాను రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌తో ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి ఎంపిక చేసి స్టేట్‌ సిలబస్‌ను కొనసాగించారు. 2019-20 విద్యా సంవత్సరానికిగాను సీబీఎస్‌ఈ సిలబస్‌ ద్వారా విద్యాబోధనలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. గతేడాది ఒక ప్రిన్సిపల్‌ ముగ్గురు క్వాలిఫైడ్‌ ఉపాధ్యాయులతో తరగతులను నిర్వహించారు. ఈ ఏడాదికి 6, 7వ తరగతులు కావడంతో సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించేందుకు చర్యలను చేపడుతున్నారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, సామగ్రిని అందించడంతోపాటు సిబ్బంది నియామకం పాఠశాలల పునఃప్రారంభం అయ్యేసరికి చర్యలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది 6వ తరగతి ప్రధాన పరీక్షలకు హాజరైన విద్యార్థుల ఫలితాలను సైతం త్వరలో విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

వానపైనే ఆశలు

Tags:Special for the gurus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *