Natyam ad

గ్రంధాలయాల అభివృద్దికి ప్రత్యేక నిధులు-మంత్రి తలసాని

హైదరాబాద్ ముచ్చట్లు:


స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి నేటి వరకు గ్రంధాలయాలపై  ప్రత్యేక దృష్టి సారిస్తూ, వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ తార్నాక డివిజన్ లో  85 లక్షల రూపాయలతో గ్రంధాలయ నిర్మాణానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం  భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, అధికారులు పాల్గొన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ సమాజానికి గ్రంధాలయలు చాలా అవసరమని, నగరంలో  83 గ్రంధాలయాలను అభివృద్ధి చేశామని, పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రంథాలయ పని వేళల్లో కూడా మార్పులు చేశామని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన సిలబస్ ను కూడా అందులో అందుబాటులో ఉంచమన్నారు  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ.

 

Tags: Special funds for the development of libraries-Minister Talasani

Post Midle
Post Midle