న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి

 కాకినాడలో న్యాయవాదిపై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి
రాజమహేంద్రవరంలో న్యాయవాదుల నిరసన


రాజమహేంద్రవరం ముచ్చట్లు:


దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు, క్రూరమైన హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాళ్ళ సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేసారు. కాకినాడలో న్యాయవాది కాలా నాగేశ్వరరావుపై ప్రో నోట్ కేసులో రికవరీ కోసం అరెస్టు వారెంట్ తేవడంతో ప్రత్యర్ధి  క్లయింట్ అయిన మెండు శ్రీను అనే వ్యక్తి  రేడియం బ్లేడ్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని, తృటిలో అతడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. న్యాయవాదిపై ఈ హత్యాయత్నాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ విధులు బహిష్కరించనట్టు తెలిపారు. జరిగిన ఘటనను నిరసిస్తూ రాజమహేంద్రవరం జిల్లా కోర్టు వ ద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహింఛి కోర్టు విధులకు హాజరు కాకుండా తమ నిరసన తెలిపారు. న్యాయవాదులపై వరుసగా జరుగుతున్న దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిగణనలోకి తీసుకుని న్యాయవాదుల రక్షణ చట్టం తేవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా దాడులు జరిగితే మాత్రం న్యాయవాదులకు కూడా ఆయుధాలు ఇవ్వాలని అడిగే పరిస్థితి ఖచ్చితంగా ఎదురవుతుందన్నారు ఈ సందర్భంగా ముప్పాళ్ల సుబ్బారావుతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యిళ్ల శివ ప్రసాద్, కార్యదర్శి పి.వి.వి.నాగరాజు , సీనియర్ కమిటీ సభ్యులు తవ్వాల వీరేంద్రనాద్ , డోకల అప్పారావు తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టి అమల్లోకి తేవాలని డిమాండ్ చేసారు. న్యాయవాది కార్యాలయంలోకి ప్రవేశించి మరీ దాడులకు తెగపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ దాడిలో అతడి చెవి, బుగ్గపై తీవ్రంగా గాయాలయ్యాయన్నారు. రక్తమోడుతున్న అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చడంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించి నిందితుడికి అరెస్టు చేయడంతో పాటు తక్షణం శిక్ష పడేలా చేయాలని కోరారు. తీర్పులు చెప్పే న్యాయమూర్తులు, కేసులు వాదించే న్యాయవాదులకు రక్షణ లేకపోతే నిష్పక్షపాతంగా విచారణలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తమ్మారెడ్డి పాణిగ్రాహి,కోశాధికారి కె.ఎన్.వి.బాబు, పులగం రామలింగారెడ్డి, లక్ష్మణ్, కొండేటి రాణి, గొల్లపల్లి శ్రీనివాస్, సునీల్ లయోనిల్,బట్టు సునీల్, దాసరి అమ్ములు, సాకా సురేష్, , రామకృష్ణ, కాశీ శ్రీనివాసరావు, నామా సత్యనారాయణ, టి.రాజారత్నం, ధర్నాలకోట వెంకటేశ్వరరావు , రఘు, హస్సన్ ,తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Special legislation should be enacted to protect lawyers

Post Midle
Natyam ad