పుంగనూరులో పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రత్యేక చర్యలు

పుంగనూరు ముచ్చట్లు:
 
 
మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండు, రహమత్‌నగర్‌, ఎంబిటి రోడ్డు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికులు చెత్తను తొలగించడం, బ్లీచింగ్‌ వేయడం, ఫినాయిల్‌ స్ప్రే చేయడం, చెత్తసేకరణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తామన్నారు. దోమలు ప్రభలకుండ చెత్తను తొలగించి, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు తమదృష్టికి తీసుకురావాలని కోరారు. పారిశుద్ద్య కార్యక్రమాలను శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రబాబు పర్యవేక్షించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Special measures for sanitation programs in Punganur

Natyam ad