చెరువుల పునరుద్దరణకు ప్రత్యేక చర్యలు

– పైలెట్‌ ప్రాజెక్టుగా పుంగనూరు నియోజకవర్గం
– తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు
– చెరువును పరిశీలించి స్టేట్‌ ఉపాధిహామీ డైరక్టర్‌ చిన్నతాత య్య
-రైతులు, నేతల సూచనలు, సలహాలు స్వీకరణ

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

భూమి మీద పడే ప్రతి వర్షపు నీటి బొట్టును నిల్వ చేసే విధంగా చెరువుల పునరుద్దరణకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు ఈజిఎస్‌ స్టేట్‌ డైరక్టర్‌ చిన్నతాతయ్య స్పష్టం చేశారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలమేరకు శుక్రవారం ఆయన తోపాటు ఈజిఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబరు విశ్వనాథం, డ్వామా పీడీ చంద్రశేఖర్‌ తదితరులు కలిసి దుర్గసముద్రం సమీపంలో గల బుటకపల్లె చెరువును పరిశీలించారు.కొన్నేళ్ళ క్రితం నిర్మించిన ఈ చెరువు కట్ట బలహీనంగా ఉండడంతోపాటు, కోతకు గురై చెరువు కట్టకు వేసిన మట్టి పొలాల్లోకి జారిపోవడంతో పొలాలన్నీ నాశనం అవుతోందని గ్రామస్తులు అధికారులకు సూచించారు. వెహోరవతోపాటు, తూము,కట్ట బలపరుచుట, కొండ వాలు నుంచి వర్షపు నీరు చెరువు చేరే విధంగా ఫీడర్‌, సఫ్లె ఛానల్స్ పనులు చేపట్టాలని గుర్తించారు.చెరువు లోగల పూడిక మట్టిను తీసి బయటకు తరలించేలా చూడాలని అధికారులకు రైతులు కోరారు. డైరక్టర్‌ చిన్నతాతయ్య మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో తొలుత ఫైలెట్‌ ప్రాజెక్టు గా మండలానికి ఒక చెరువును తీసుకొని అభివృద్దిచేస్తామని, తరువాత గ్రామపంచాయతీకి ఒక చెరువును తీసుకోవడం, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసే దిశగా చర్యలు తీసుకొంటామని తెలిపారు.చెరువుల అభివృద్దిపట్ల చేపట్టాల్సిన పనులను రైతులు, నేతల స్రలహాలు సేకరించారు. చెరువు స్థలం దురాక్రమణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ దామోదరరాజు, మండల పార్టి కన్వీనర్‌ రామమూర్తి, సర్పంచ్‌ సరస్వతమ్మ, అంబుడ్స్మెన్‌ రాథరామనాయుడు, ఏపీడీలు రామాంజనేయులు, శ్రీనివాసులు,ఇరిగేషన్‌ కన్సల్‌టెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఓలు శ్రీనివాసులు, శివశంకర్‌,నేతలు చెంగారెడ్డి, హరి,తదితరులున్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Special measures for the rehabilitation of ponds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *