Natyam ad

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ఏలూరు ముచ్చట్లు:
 
ఏలూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. ఏలూరు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాగరాజు గురువారం ఏలూరులోని ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.  ఏలూరు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిగ్నల్ లైట్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ట్రాఫిక్ సిఐ  నాగరాజుకు సూచించారు. నగరంలో దొంగతనాల నివారణకు ముఖ్యమైన కూడళ్ళలో సిసి C కెమేరాలు ఏర్పాటు చేయాలని అన్ని వ్యాపార సంస్థలలో కూడా ముందుస్తుగా దొంగతనాలు నివారించడానికి సిసి  కెమేరాలు ఏర్పాటు చేసుకొనే విధంగా వ్యాపార సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.ఏలూరు నగరంలో యువత వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని వాహనాల వేగం తగ్గించుకొనే విధంగా అన్ని విద్యా సంస్థలలో అవగాహన కల్పించాలని ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించకుండా ట్రాఫిక్ నిబంధనలు సూచించే విధంగా నేమ్ బోర్డులను ఏర్పాటు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Special measures for traffic control