పుంగనూరులో పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు – కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:24/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యాన్ని నివారించి, పట్టణంలో గ్రీనరీని పెంపొందించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు .ఆదివారం ఆయన మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షణ్‌ 2021లో భాగంగా ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటడం, వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయడం చేపడుతామన్నారు. పట్టణంలోని 31 వార్డుల్లోను ఖాళీ స్థలాలు, రోడ్డుకు ఇరువైపుల, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పాఠశాలల వద్ద సుమారు 50 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించనున్న ఆర్టీసిడీపో వద్ద కూడ మంత్రి స్వయంగా మొక్కలు నాటారని, దీనిని ఆదర్శంగా తీసుకుని భారీ స్థాయిలో గ్రీనరీని పెంపొందిస్తామన్నారు. అలాగే పట్టణంలో ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రహస్యంగా ప్లాస్టిక్‌ను వినియోగించిన, విక్రయించి వారీపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, దుకాణాలను సీజ్‌ చేస్తామని తెలిపారు. అలాగే  హోంకంపోస్ట్ విధానాన్ని పటిష్టంగా అమలు పరుస్తామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను భాగస్వామ్యులను చేసి, స్వచ్చ సర్వేక్షణ్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌ పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags; Special measures to protect the environment in Punganur – Commissioner KL Verma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *