రెండు రోజుల్లోగా స్పెషల్ ఆఫీసర్ల ప్రతిపాదనలను పంపాలి

-జిల్లా కలెక్టర్లకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి  ఆదేశం
Date:17/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆగస్టు 1 నుండి రాష్ట్రంలో నూతనంగా  ఏర్పడే 68 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమీషనర్లు, 12751 గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ప్రతిపాదనలను రెండు రోజుల్లోగా పంపించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి  ఆదేశించారు.మంగళవారం సచివాలయంలో  గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం, హరితహారం, మత్స్య శాఖ, పాడిగేదెల పంపిణీ, వివిధ కేసులకు సంబంధించి మెడికల్, పోస్టుమార్టమ్ నివేదికలు, లారీల సమ్మె తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, డిజిపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పిసిసిఎఫ్ పి.కె.ఝా, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్, సి.యం.ఓ. ఓ.ఎస్.డి (హరితహారం) శ్రీమతి ప్రియాంక వర్గీస్, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ టి.కె. శ్రీదేవి, మత్స్యశాఖ కమీషనర్ సువర్ణ  మరియు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ 12751 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు, 565 గ్రామ పంచాయితీ క్లస్టర్లకు ఇంచార్జీలుగా గ్రామపంచాయతీ సెక్రటరీలను, 68 నూతన మున్సిపాలిటీలకు మున్సిపల్ కమీషనర్లుగా తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లుగా ఆర్.డి.ఓ లేదా జిల్లా స్ధాయి అధికారులను నియమించే ప్రతిపాదనలను రూపొందించి రెండురోజుల్లో మున్సిపల్ కమీషనర్, పంచాయతీరాజ్ కమీషనర్ కు ప్రతిపాదనలు పంపాలని సి.యస్ ఆదేశించారు.మున్సిపాలిటీలకు సంబంధించి ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ స్ధానిక ప్రజాప్రతినిధులతో చర్చించి జిల్లా కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లు, కమీషనర్ల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని, కొన్నిమండలాలకు ఒకటి కంటే ఎక్కువ పట్టణ స్ధానిక సంస్ధ  లు ఉంటే దాని కనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలన్నారు. గ్రామపంచాయతీలోని మినిట్స్ పుస్తకాలను సీజ్ చేసి, కొత్త మినిట్స్ పుస్తకాలను తెరవాలని అన్నారు. కొత్త మున్సిపాలిటీల కార్యాలయాల వద్ద బోర్డులను ఏర్పాటుచేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలను మూసివేసి జాతీయ బ్యాంకులలో కొత్తగా ఖాతాలను  తెరవాలన్నారు. వివిధ మున్సిపాలిటీలలో చేపట్టే పనులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా మున్సిపల్ కమీషనర్లతో సమీక్షించాలని, ఈ పనులు డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా కాలానుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అర్విందర్ కుమార్ కోరారు. ఈ పనులన్ని వివిధ దశలో ఉన్నాయని,  మున్సిపల్ కమీషనర్లతో ఇప్పటికే సమీక్షించారని అన్నారు. మున్సిపాలిటీలలో  ప్రధాన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, ముఖ్యమైన ప్రాంతాలలో  సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు.భూసేకరణ ప్రకటలను సమాచార శాఖ ద్వారానే జారీ చేయాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాని కొంత మంది కలెక్టర్లు నేరుగా భూసేకరణ ప్రకటనలను జారీ చేస్తున్నారని అన్నారు. ఇకముందు సమాచార శాఖ ద్వారానే జారీ చేయాలని తెలిపారు. ఈ విషయంలో డిపిఆర్ ఓ లతో సమీక్షించాలని,  బకాయిలు ఉన్న 37 కోట్ల రూపాయలు విడుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను అర్వింద్ కుమార్ కోరారు.పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీలను క్లస్టర్లకు కలపాలని, గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం పై పంచాయతీ రాజ్ శాఖామాత్యులు ఇప్పటికే ఆదేశాలు జారీచేసారని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ జేస్తున్నామన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ల సన్నద్ధతను సి.యస్ సమీక్షించారు.వివిధ కేసులకు సంబంధించి పోస్టుమార్టమ్ నివేదికలు, మెడికల్ రిపోర్టులు జిల్లాల వారిగా పెండింగ్ లో లేకుండా చూడాలని సి.యస్ ఆదేశించారు. 15 రోజుల తరువాత పురోగతిపై సమీక్షిస్తామన్నారు. వివిధ కేసులకు సంబంధించి ఇన్ వెస్టిగేషన్ ను కాలపరిమితిలోగా పూర్తి చేయవలసి ఉంటుందని, మెడికల్, పోస్ట్ మార్టమ్ నివేదికలు జాప్యం లేకుండా చూడాలని డిజిపి మహేందర్ రెడ్డి కలెక్టర్లను కోరారు. రాష్ట్ర స్ధాయిలోను ఈ అంశంపై సమీక్షిస్తామని, జిల్లా స్ధాయిలో కలెక్టర్లు పెండెన్సీ పై సమీక్షించాలన్నారు. ఈ కేసులను సమీక్షించడానికి ప్రత్యేక  మెకానిజమ్ ను రూపొందించాలని అన్నారు. ఈ నెల 20 నుండి లారీల సమ్మెకు ప్రైవేటు యజమానులు పిలుపు నిచ్చినందున నిత్యావసర వస్తువుల పంపిణీకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సి.యస్ ఆదేశించారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ మాట్లాడుతూ సమ్మె విషయంలో  లారీల అసోసియేషన్లు రాష్ట్రానికి సంబంధించి లోడింగ్, అన్ లోడింగ్ సందర్భంగా హమాలీలు అదనంగా డబ్బులు అడుగుతున్నారని తెలిపారని ఈ విషయమై ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇక ముందు జరగకుండా చూడాలని సూచించారు. ఓవర్ లోడింగ్ అరికట్టాలని, డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకుండా చూడాలని కలెక్టర్లను కోరారు.చేప పిల్లలకు సంబంధించి పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా మాట్లాడుతూ గొర్రెల పంపిణీ మాదిరిగానే చేప పిల్లల పంపిణీకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. 21,568 వాటర్ బాడీస్ లలో దాదాపు 80 కోట్ల చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లు పూర్తయ్యాయని, సప్లయర్ల వెరిఫికేషన్ త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ఈ నెలాఖరుకు చేప పిల్లలు సిద్దంగా ఉంటాయని అన్నారు. వచ్చే చేపల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఇంటిగ్రేటేడ్ ఫిషరీస్ డెవలప్ మెంట్ స్కీం అమలుచేస్తున్నామని, లబ్దిదారుల నుండి ధరఖాస్తులు స్వీకరిస్తున్నామని  జిల్లా స్ధాయి సాంక్షన్ కమిటీ  ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని అన్నారు.
రెండు రోజుల్లోగా స్పెషల్ ఆఫీసర్ల ప్రతిపాదనలను పంపాలిhttps://www.telugumuchatlu.com/special-officers-offers-should-be-sent-within-two-days/
Tags; Special Officers’ Offers should be sent within two days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *