జ్యేష్ఠ‌ మాసంలో విశేష పూజా కార్య‌క్ర‌మాలు

తిరుమల ముచ్చట్లు :

లోక కల్యాణార్థం జ్యేష్ఠ‌ మాసంలో ప‌లు విశేష పూజా కార్య‌క్ర‌మాలను టిటిడి నిర్వ‌హించనుంది. ఇప్ప‌టికే నిర్వహించిన కార్తీక, ధనుర్‌, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ‌ మాస ఉత్సవాల‌కు భక్తుల‌ నుండి విశేషాదరణ ల‌భించింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.- జూన్ 18న జ్యేష్ఠ శుద్ధ అష్ట‌మి సంద‌ర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం యాగ‌శాల‌లో ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు శుక్లా దేవ్య‌ర్చ‌నం జ‌రుగ‌నుంది.- జూన్ 21న‌ జ్యేష్ఠ శుద్ధ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల వ‌సంత‌మండ‌పంలో సాయంత్రం 3.30 నుండి 4.45 గంట‌ల వ‌ర‌కు విష్ణు అర్చ‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.- జూన్ 24న జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ‌ సంద‌ర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం యాగ‌శాల‌లో ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు వ‌ట‌సావిత్రీ వ్ర‌తం జ‌రుగ‌నుంది.

 

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:Special pooja programs in the senior month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *