కేదార్‌నాథ్ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు.. గుహలో ధ్యానం

Special prayers at the Kedarnath Temple are meditation in the cave

Special prayers at the Kedarnath Temple are meditation in the cave

Date:18/05/2019

డెహ్రాడూన్  ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక పర్యటన సాగిస్తున్నారు. ఏడవది, చివరిది అయిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియగా, ఆదివారంనాడు పోలింగ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారంనాడు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి ఓ గుహలో ధ్యానం చేశారు. ఆ ప్రాతంలో జరుగుతున్న కేదార్‌నాథ్ అభివృద్ధి ప్రాజెక్టును సైతం ప్రధాని ఈ సందర్భంగా సమీక్షించారు. కేదార్‌నాథ్ వెళ్లే మార్గంలో తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేదార్‌నాథ్‌లో రాత్రి బస చేసిన తర్వాత ఆదివారంనాడు బద్రీనాథ్ బయలు దేరి వెళ్తారు. ఆ సాయంత్రమే తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా కేదారినాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

 

డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్‌ని పెడితే సెట్‌ అవుతారు:విహెచ్

 

Tags; Special prayers at the Kedarnath Temple are meditation in the cave

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *