గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

విశాఖపట్నం ముచ్చట్లు:


చేపల వేటపై ప్రభుత్వం ప్రకటించిన నిషేద కాలం పూర్తవ్వడంతో మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేందుకు సిద్ధమవు తున్నారు.మత్య్ససంపద మెరుగు పడే సమయంలో ప్రతీ ఏటా ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ వేటను నిషేదిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.అయితే కాల పరిమితి పూర్తి కావడంతో తమ వేట లాభసాటిగా సాగాలని ఆకాక్షిస్తూ మత్య్సకార కుటుంబాల మహిళలు గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.సుమారు రెండు నెలల విరామానంతరం ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి నుండి మరపడవలు, మినీ ట్రాలర్లు మత్స్య వేటకు బయలుదేరి వెళుతున్న నేపథ్యంలో ఈ సీజన్లో మత్స్య పరిశ్రమ ఆశాజనకంగా ఉండాలని కోరుతూ ఫిషింగ్ హార్బర్ లోని శ్రీ గంగమ్మ తల్లికి మత్స్యకారులు విశేష పూజలు నిర్వహించారు. గంగాదేవి ఆశీస్సులతోనే మత్స్య పేట సజావుగా సాగుతుందనేది మత్స్యకారుల ప్రగాఢ నమ్మకం. మరోవైపు సముద్రున్ని చల్లబరిచేందుకు పసుపు కుంకుమ, పాలతో అభిషేకాలు చేశారు.గంగమ్మ తల్లి పండుగతో ఫిషింగ్ హార్బర్ కొలహలంగా కనిపించింది.

 

Tags: Special pujas for Gangama mother

Post Midle
Post Midle
Natyam ad