కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు..

హైదరాబాద్ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్షుక్ నగర్ లో ఉన్న కనక దుర్గ దేవాలయం  వద్ద 101 కొబ్బరికాయ లతో మొక్కు తీర్చుకున్నారు.  టిఆర్ఎస్ నాయకులు. నిన్న సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో చైతన్యపురి తెరాస నాయకులు,ఎల్బినగర్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రామ్మోహన్ గౌడ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలని అమ్మవారిని కోరుకున్నారు.
తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజల దీవెనలు కేసీఆర్ కి ఉండాలని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.దేశం లో పాలన దక్షత కలిగిన వ్యక్తి ప్రజల కోసం సేవ నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
 
Tags:Special pujas for KCR to stay with Ayurveda

Leave A Reply

Your email address will not be published.