వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కి   విశేష పూజలు

Date:17/10/2020

దర్శి ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి  పట్టణం లో  ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లో శనివారం దసరా శరన్నవరాత్రులు లో భాగంగా మొదటి రోజు వాసవి మాతాకు  వేద పండితులు తారక సోమేశ్వర శర్మ మరియు గాదె రాజేష్ శర్మ లు ఆధ్వర్యంలో  ప్రాతః కాలం నుండి అమ్మవారి కి  పంచామృత అభిషేకం మరియు కుంకుమ పూజ విశేషంగా జరిపారు. మొదటి రోజు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సూరె చినసుబ్బారావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి భక్తులు కు తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆలయ పూజారి మాట్లాడు తూ భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించి మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ కమిటీ భక్తులు కు కోవిడ్ సందర్బంగా శానిటైజర్, మాస్క్ లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో కోవిడ్ సందర్బంగా  భక్తులు సామాజిక దూరం పాటించి, మాస్క్ లు ధరించి  అమ్మవారి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.

చిన్న‌శేష వాహ‌నంపై దామోద‌ర కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tags: Special pujas for the resident Kanyaka Parameswari Ammavari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *