కార్తీక  పౌర్ణమి సందర్భంగా యాదాద్రి లో ప్రత్యేక పూజలు

-సత్యనారాయణ స్వామి వ్రతం పూజలలో  భక్తులు సందడి
-కొవిండ్ నిబంధనలు ప్రకారం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

Date:30/11/2020

యాదాద్రి భువనగిరి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారి ఆలయం లో కార్తీక పౌర్ణమి  పురస్కరించుకొని  ఆలయంలో శ్రీ స్వామి వారికి నిజఅభిషేకం,ఆర్చనలు,నిత్యకళ్యాణం పూజలు ఆలయ ఆర్చకులు నిర్వహించారు. ఉదయం నుండి ఆలయ పరిసరాలలో భక్తులతో కిటకిటలాడింది.శ్రీ స్వామివారి దర్శనం కు క్యూలైన్ లో భక్తులు బారులు తీరారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే భక్తులకు ఉదయం 5.30ని ల నుండి వత్ర పూజలు ప్రారంభించారు,ప్రతి గంటకు 100 వత్ర పూజలు జరిగే విధంగా 8 బ్యాచ్ లు ఏర్పటు చేశారు.వత్ర పూజలు పాల్గొనేందుకు ఉదయం నుండి  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.కార్తీక సోమవారం పౌర్ణమి  కావడంతో   శ్రీ స్వామి వారి దర్శనంతో పాటు శివాలయంకు భక్తులు బారులు తిరిన్నారు. దర్శనం అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా మహిళా భక్తులు కార్తీక దీపారాధన చేసుకున్నారు.శ్రీ స్వామి వారి దర్శనం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలకు కొవిండ్ నిబంధనలు ప్రకారం ప్రత్యేక ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు.

మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం

Tags; Special pujas in Yadadri on the occasion of Karthika full moon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *