Natyam ad

పుంగనూరులో గ్రామీణ వైద్యసేవలకు విశేష స్పందన

– వైఎస్సార్‌ క్లీనిక్‌ల్లో రోజుకు 50 మందికి పైగా చికిత్సలు

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దనే వైద్యసేవ లు అందించే విలేజ్‌ క్లీనిక్‌ పైలేట్‌ ప్రాజెక్టుకు విశేష స్పందన లభిస్తోంది. గురువారం పుంగనూరు మండలంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు 11 వైఎస్సార్‌ హెల్త్ క్లీనిక్‌లు ప్రారంభించారు. గ్రామీణ వైద్యసేవలు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సల్మా , డాక్టర్‌ సృజన ల ఆధ్వర్యంలో సేవలు నిర్వహిస్తున్నారు. ఆరడిగుంటలో 45 మందికి వైద్య పరీక్షలు చేశారు. 11 మంది గర్భవతులకు చికిత్సలు నిర్వహించారు. వీటితో పాటు 104 డాక్టర్‌ సిందుజ ఆధ్వర్యంలో వెహోబైల్‌ వైద్యసేవలు నిర్వహించారు. డాక్టర్‌ సల్మా మాట్లాడుతూ వైఎస్సార్‌ హెల్త్ క్లీనిక్‌ల ద్వారా 14 రకాల పరీక్షలు నిర్వహించి, 67 రకాల మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే గర్భవతులు పిహెచ్‌సికి రావడం ఇబ్బందికరంగా ఉండటంతో పట్టణంలోని మ్యాక్స్ సెంటర్‌ ద్వారా గర్భవతులకు చికిత్సలు అందిస్తున్నామన్నారు. నెలలో రెండు రోజులు వైఎస్సార్‌ హెల్త్ క్లీనిక్‌లలో డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విలేజ్‌ హెల్త్క్లీనిక్‌ పైలేట్‌ ప్రాజెక్టులో రోజుకు 50 మందికి వైద్యసేవలు అందిస్తున్నామని, గత నెల 21 నుంచి ఈ కార్యక్రమం ట్రయల్‌రన్‌ జరుగుతోందని తెలిపారు. ప్రజలందరికి గ్రామీణ వైద్యం అందించడంలో సిబ్బంది ఆహర్నిశలు పనిచేసి , ఆదర్శంగా నిలుస్తామని ఆమె తెలిపారు.

 

Tags: Special response to rural medical services in Punganur

Post Midle