దర్శి లో కాశీ విశ్వేశ్వరునికి విశేష రుద్రాభిషేఖం

Date:26/11/2020

దర్శి  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి లో వేంచేసియున్న శ్రీ గంగా అన్నపూర్ణ  సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాములు వారికీ ఆలయ అర్చకులు నాదేండ్ల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో గురువారం  కార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి సందర్బంగా విశేషంగా రుద్రాభి షేఖం, విశేష అలంకరణ జరిపించారు. ఈ అభిషేకం  కార్యక్రమం లో స్వామి వారి భక్తులు మాదాసు శ్రీనివాసరావు, సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్బంగా కాశీ విశ్వేశ్వర ఆలయం లో భక్తులు కోవిడ్ సందర్బంగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్క్ లు ధరించి, ధురంగా దర్శనం చేసుకొన్నారు. తదుపరి ఆలయ అర్చకులు మల్లికార్జున శర్మ భక్తులు కు తీర్ధ ప్రసాదాలు పంపిణి చేశారు. ఆలయ యాజమాన్యం భక్తులకు అన్ని సౌకర్యాలు కలిపించారు. ఈ కార్యక్రమం లో  మహిళలు అధిక సంఖ్య లో పాల్గొణి కార్తీక దీపాలు వెలిగించి పూజలు చెసి తమ ఆరాధ్య దైవం ను దర్శించి తమ కోర్కెలు స్వామి వారికి  విన్నవించుకొన్నారు.

ఏబీ వెంక‌టేశ్వ‌రావుకు సుప్రీంలో చుక్కెదురు

Tags: Special Rudrabhishekam to Kashi Vishweshwara in Darshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *