పుంగనూరులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో కారోనాను నియంత్రించేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. ఆదివారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి పట్టణంలోని 31 వార్డుల్లోను హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో కరోనా వ్యాప్తి చెందకుండ తగు చర్యలు చేపట్టామన్నారు. సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయడంతో కరోనా నియంత్రణ అవుతోందన్నారు. అలాగే కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్‌ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు పట్టణ ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ చైర్మన్‌ నాగభూషణం , కౌన్సిలర్లు అమ్ము, తుంగామంజునాథ్‌, పార్టీ నాయకులు ఖాదర్‌బాషా, లక్ష్మణ్‌రాజు, పిఎల్‌.శ్రీధర్‌ పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Special Sanitation Programs in Punganur – Commissioner KL Verma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *