Special surveillance on sales of sanitizers

శానిటైజర్ల అమ్మకాలపై ప్రత్యేక నిఘా

-మెడికల్ షాప్ యజమానులకు ప్రత్యేక మీటింగ్ కండక్ట్ చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ వి విజయ్ కుమార్

Date:07/08/2020

చిత్తూరుముచ్చట్లు:

రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జనరల్ వారి ఆదేశాల మేరకు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సహకారంతో జిల్లాలో ఉన్న అన్ని మెడికల్ షాపులలో, అదేవిధంగా బొబ్బిలి సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని మెడికల్ షాపులను పరిశీలించి శానిటైజర్ల అమ్మకాలపై మెడికల్ షాప్ యజమానులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని బొబ్బిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ వి విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు.. ప్రతి శానిటైజర్ అమ్మకంపై తప్పనిసరిగా రసీదును రాసి కస్టమర్కు అందజేయాలని షాప్ యజమానులకు సూచించారు..ఎవరైనా ఉద్దేశపూర్వకంగా శానిటైజర్లను కొంటె వారి వివరాలను వెంటనే డిపార్ట్మెంట్కు తెలియజేసి ప్రభుత్వానికి సహకరించాలని మెడికల్ షాపు యజమానులను కోరారు.. ఎవరైనా రసీదు లేకుండా శానిటైజర్ అమ్మితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడునని మెడికల్ షాపు యజమానులను హెచ్చరించారు.. బొబ్బిలి సర్కిల్ ఆఫీస్లో అన్ని మెడికల్ షాప్ యజమానులతో మీటింగ్ కండెక్ట్ చేసి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరినట్లు సీఐ వి విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు.. శానిటైజర్ లు దుర్వినియోగం కాకుండా మెడికల్ షాప్ యజమానులు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.. ముత్తు కోసం శానిటైజర్లు తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

మదనపల్లి సబ్ కలెక్టర్ గా జాహ్నవి 

Tags: Special surveillance on sales of sanitizers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *