– భూగర్భజలాలను పరిశీలిస్తాం
– రైతులకు సహాయం అందిస్తాం
-మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి
Date:15/12/2019
పుంగనూరు ముచ్చట్లు:
జిల్లా వ్యాప్తంగా డార్క్ ఏరియాలుగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక సర్వే నిర్వహించి, భూగర్భజలాలను పరిశీలించి, రైతులకు సహాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి పుంగనూరు మండలం రాంపల్లె వద్ద లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో నిర్మించిన డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించారు. లయన్స్‌క్లబ్ జిల్లా పీఆర్వో డాక్టర్ శివతో మాట్లాడి సెంటర్‌ను ప్రభుత్వానికి అప్పగించే విషయమై చర్చించారు. అలాగే మండలం కీలకిరి గ్రామంలో వెంకట్రామిరెడ్డి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని బాస్కర్రెడ్డిల ఆధ్వర్యంలో బండ్లపల్లె, మంగళం పంచాయతీకి చెందిన రైతులు మంత్రిని కలసి డార్క్ ఏరియాలలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని , దీని కారణంగా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ విషయమై వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ డార్క్ ఏరియాల పేరుతో గత ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని , దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి తక్షణమే స్పందిస్తూ జిల్లా వ్యాప్తంగా డార్క్ ఏరియాలలో సర్వే చేస్తామన్నారు. భూగర్భజలాల మట్టాలను పరిశీలించి, అనువైన ప్రాంతాలలో డార్క్ ఏరియాల జాబితా నుంచి తీసివేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డార్క్ ఏరియాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి పరిస్థితులు రైతులకు ఎదురైందన్నారు. వైఎస్సార్సీపి ప్రభుత్వంలో రైతులకు నష్టం జరగకుండ తగు చర్యలు చేపడుతామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి నివేదికలు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్, కొండవీటి నాగభూషణం, జిల్లా ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర, మాజీ కౌన్సిలర్లు సుబ్బమ్మ, అమ్ము, రేష్మా, పార్టీ నాయకులు జయకృష్ణ, ఎంఎం.ఆనంద, కిజర్‌ఖాన్, అర్షద్‌అలి, రాజేష్, సురేష్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.
Tags: Special Survey on DarkArias