అయ్యప్ప స్వామికి విశేష పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామిని భక్తులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో అయ్యప్ప స్వామిని అలంకరించి ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు 41 రోజులపాటు అయ్యప్ప స్వామి మాల ధరించి. కఠోర దీక్షలో కొనసాగుతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయ్యప్ప భజనలు చేసి. పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.గురు స్వామి -భక్తవత్సలం ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. బండి కృష్ణ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలోనిర్వాహకులు శరణ్,వాసు,దేవేంద్ర,రవి,భగత్ సింగ్ కాలనీ అయ్యప్ప భక్తులు పాల్గొని పూజలు చేశారు.

Tags: Special worship to Lord Ayyappa
