ప్రభుత్వ వైద్యశాలల్లో మరింత మెరుగైన సేవలకు నిర్దిష్ట ప్రణాళిక- జిల్లా కలెక్టర్

తిరుపతి ముచ్చట్లు:

ప్రభుత్వ వైద్యశాలల్లో మరింత మెరుగైన సేవలకు నిర్దిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నామని, ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్ పై , ఫోర్త్ వేవ్ ముందస్తు ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం అమరావతి నుండి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణ బాబు, ముద్దాడ రవిచంద్ర, కమీషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాఘవేంద్ర రావు, ఎ.పి. వైద్య విధాన పరిషత్ వినోద్ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్ లతో వైద్య, ఆరోగ్య శాఖ  వైద్య విద్య అధికారులతో బయోమెట్రిక్ అమలు, హాజరు, వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే, ఫైర్ ఆడిట్, భద్రత, ఖాళీల నియామకాలు, తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా  సమీక్షించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడతూ  వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల బయోమెట్రిక్  హాజరును సమీక్షించి వంద శాతం అమలు చేయాలని సూచించారు. హాస్పిటల్ లో మరణించిన రోగులను తరలించేందుకు మహాప్రస్థానం వాహనాలు తప్పనిసరిగా వాడాలని, ఇంకా అవసరమైతే అందుబాటులో ఉన్న ఇతర పాత వాహనాలను వినియోగించి సేవలు అందించాలని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన విధివిధానాలు అమలు అయ్యే విధంగా పాలసీ రోపొందిస్తున్నారని తెలిపారు. కోవిడ్ వ్యాక్షినేషన్ మూడవ డోసు మరియు ముందస్తు జాగ్రత్త వ్యాక్సినేషన్ వేసుకున్న వారి శాతం తక్కువ ఉన్నదని  వాటిపై పురోగతి  సాదించాలని తెలిపారు. కోవిడ్ ఫోర్త్ వేవ్ ఇతర రాష్ట్రాలలో ప్రభావం చూపుతున్నందున ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.  భౌతికదూరం పాటించడం,  వ్యాక్సినేషన్ వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఫీవర్ సర్వే సక్రమంగా నిర్వహించాలని డెంగ్యు, మలేరియా ఇతర జ్వరాలను, కోవిడ్ వలన  వచ్చే జ్వరాలను గుర్తించి హోం ఐసొలేషన్ చేసి ట్రీట్మెంట్ అందించాలని తెలిపారు. భద్రతా అంశాలలో భాగంగా ఫైర్ సేఫ్టీ కొరకు నిబంధనల మేరకు హాస్పిటల్స్  ఏర్పాటు చేసుకోవాలని తదనుగుణంగా అగ్నిమాపక శాఖ అధికారులు ఎన్.ఓ.సి లను మంజూరు  చేయాలని కోరారు. ఆసుపత్రులలో సిసి కెమెరాలు ఏర్పాటు  చేసుకోవాలని, భద్రతా అంశాలలో రాజీపడరాదని తెలిపారు. హాస్పిటల్ లలో ఏర్పడిన ఖాళీలు భర్తీకి, కోవిడ్ కి సంబందించిన పాత బిల్లులపై  వివరాలు సమర్పించాలని తెలిపారు. అనస్తీషియా, గైనకాలజిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులు ఖాళీలు ఉంటే వివరాలు తెలిపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.భారతి, ఎస్.వి.మెడికల్ కాలేజీ ప్రినిసిపల్ చంద్రశేఖర్, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థసారథి రెడ్డి, డి సి హెచ్ ఎస్ విద్యాసాయి, తదితరలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Specific plan for better services in government hospitals- District Collector

Post Midle
Natyam ad