Natyam ad

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగం

విశాఖపట్టణం  ముచ్చట్లు:

అంబానీ, ఆదానీల చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైపు ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్‌ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని సగర్వంగా ప్రకటించారు. దేవుడి దయతో ఒక పరిశ్రమ ఇవాళ ప్రారంభమైంది.. రెండో ఫేజ్‌ పనులకూ శంకుస్థాపన చేశాం. యొకహొమా కంపెనీ ప్రపంచంలోనే 5–6 స్థానాల్లో ఉంది.. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరం అన్నారు. అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందించాం.. 2021 ఫిబ్రవరిలో ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయని.. 15 నెలల కాలంలో ఉత్పత్తి మొదలైంది.. మనం ఇచ్చే ప్రోత్సాహం, మద్దతుతో వారిని ఆకట్టుకుందని.. అందుకే రెండో విడతకూ నాంది పలికారని పేర్కొన్నారు.

 

 

 

Post Midle

ఆగస్టు 2023లో పూర్తి చేస్తామని తెలిపారన్న సీఎం జగన్.. మొదటి విడతలో రూ.1250 కోట్ల పెట్టుబడి పెట్టారు.. 1200 మందికి దాదాపుగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రెండో ఫేజ్‌లో రూ.850 కోట్లు వెచ్చిస్తున్నారు.. మరో 800 మందికి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. ఆ ప్రాంతంలోని చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించాలి.. అప్పుడే పేదరికం నుంచి బయట పడతారని.. దీనికోసం ప్రభుత్వం నుంచి వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం అన్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలోనే 98 అతిభారీ, భారీ పరిశ్రమలు రూ.39,350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. 60,541 మందికి ఉద్యోగాలు ఈ మూడేళ్లలో కల్పించామని.. 31,671 ఎంఎస్‌ఎంఈలు కూడా రూ.8,285 కోట్లతో 1,98,521 మందికి ఉద్యోగాలను ఈ మూడేళ్లలో కల్పించారని వెల్లడించారు. రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో మరో 56 అతిభారీ, భారీ పరిశ్రమలు దాదాపుగా రూ. 1,54,000 పెట్టుబడితో ఏర్పాటవుతున్నాయని.. 1,64,155 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాచని ప్రకటించారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా వస్తోన్న అవార్డులే దీనికి నిదర్శనమని సీఎం గుర్తుచేశారు.

 

 

 

విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ అలయన్స్‌ టైర్స్‌ కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్‌ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రసంగించారు. కాగా జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్‌నకు చెందిన అలయన్స్‌ టైర్స్‌ కంపెనీనే ఏటీసీ. రెండు దశల్లో మొత్తం రూ.2,200 కోట్లతో ఈ టైర్ల కంపెనీని ఏర్పాటుచేస్తున్నారు. తొలి దశలో రూ.1,384 కోట్లతో హాఫ్‌ హైవే టైర్ల తయారీ కంపెనీ నిర్మాణం పూర్తైంది. ఇవాళ్టి నుంచి అక్కడ టైర్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. రూ.816 కోట్లతో రెండో దశ పనులకు భూమి పూజ చేశారు జగన్‌. అలాగే రూ.1,002 కోట్లతో మరో 8 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. మొత్తం 250 ఎకరాల్లో ఈ ఏటీసీ పరిశ్రమ ఏర్పాటైంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 4,664 మందికి ఉపాధి దొరుకుతుంది.ఈ సందర్భంగా మాట్లాడిన జగన్‌15 నెలల్లోనే ఈ పరిశ్రమ మొదటి దశ పనులు పూర్తి చేశామన్నారు.

 

 

 

‘రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాబోయే రెండేళ్లలో 56 పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. అలాగే మూతపడ్డ ఎంఎసీఎంఈలను కూడా తెరిపిస్తున్నాం. ఇందుకోసం పెద్ద మొత్తం నిధులు మంజూరుచేస్తున్నాం. ఇక మన రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు ఏపీవైపు చూస్తున్నారు. విశాఖలో వచ్చే రెండు నెలల్లో నెలలో ఆదాని డేటా సంస్థకు శంకుస్థాపన చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయి’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మేయర్ జి హరి వెంకట కుమారి, ఎంజీ మాధవి, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Speed of industrial development in the state

Post Midle