Natyam ad

చౌడేపల్లెలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

చౌడేపల్లె ముచ్చట్లు:

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని డ్వామా ఏపిడీ వర ప్రసాద్‌ సూచించారు. సోమవారం స్థానిక ఉపాధిహామీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష జరిగింది. ప్రతి గ్రామంలోను ఉపాధి పనులు ప్రారంబించాలన్నారు. గృహ నిర్మాణ పనులకు ఉపాధి పథకం అనుసంధానంతో చెల్లించాల్సిన కూలీలకు 90 పనిదినాలు కల్పించి ఆర్థిక చేయూతనివ్వాలని సూచించారు. కొత్తగా మంజూరైన పనులు ను ఇప్పటి వరకు ప్రారంభించకుంటే వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. భువన్‌ యాప్‌ ద్వారా పనుల కేటగిరి వారీగా జియోట్యాగ్‌ చేసి మూడు రోజుల్లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూలీల లేబర్‌ బడ్టెట్‌కు అనుగుణంగా కొత్తపనులను గుర్తించి అంచనాలు సిద్దం చేయాలన్నారు. పండ్ల తోటల పెంపకం కోసం ఆసక్తి గల రైతులనుంచి ధరఖాస్త్రులు స్వీకరించాలన్నారు. పంచాయతీ ల వారీగా లక్ష్యాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన కార్యచరణ ప్రణాళికపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి నిర్వహించే రికార్డులను అబ్‌డేట్‌ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపిఓ శ్రీనివాసుల యాదవ్‌, జెఈ ధనుంజయుడు, టిఏలు అమరనాథ్‌, సయ్యద్‌భాషా ఉన్నారు.

 

Post Midle

Tags; Speed up employment guarantee works in Chaudepalle

Post Midle