చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగం పెంచండి : టీటీడీ జేఈవో సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు:
చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణ పనుల వేగం పెంచాలని టీటీడీ జేఈవో సదా భార్గవి ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను ఆమె శుక్రవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గురించి ఈఈ కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన రెండు ఫ్లోర్లతో పాటు మిగిలిన నాలుగు ఫ్లోర్లు కూడా నవంబరు చివరికి పూర్తి చేయాలన్నారు. పనులు వేగవంతం చేయడానికి అదనంగా కూలీలను నియమించుకోవాలని ఆమె సూచించారు.

అనంతరం టీటీడీ పరిపాలన భవనంలోని తన ఛాంబర్ లో కె పిసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో సదా భార్గవి సమీక్ష జరిపారు. ఆసుపత్రికి అవసరమైన యంత్ర పరికరాలు, విద్యుత్ పనులు, ప్లంబింగ్ పనులు, అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు, గ్రౌండ్ లెవెలింగ్ పనులను సివిల్ పనులతో కలిపి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతోపాటు ఆస్పత్రికి అవసరమైన సిబ్బందిని నియమించుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డిని ఆదేశించారు.డెప్యూటీ ఈఈలు జ్యోతయ్య, హర్షవర్ధన్ తో పాటు పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
Tags: Speed up the construction work of super specialty hospital for children: TTD JEO Sada Bhargavi
