పుంగనూరులో నాడు-నేడు పనులు వేగవంతం చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు నాడు- నేడు పనులను సకాలంలో పూర్తి చేయాలని సమగ్రశిక్షా అడిషినల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకట్రమణారెడ్డి కోరారు. బుధవారం సాయంత్రం మున్సిపల్‌ హైస్కూల్‌లో ఎంఈవో కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ అధికారులు, పాఠశాల హెచ్‌ఎం , పాఠశాల కమిటితో కలసి వెంకట్రమణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నాడు-నేడు పథకం క్రింద రెండవ విడత పనులను సకాలంలో పూర్తి చేసి ప్రగతి సాధించాలన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో అడ్మీషన్లు పెరగడంతో భవనాల కొరత లేకుండ ఉండేందుకు పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వీటిపై ప్రతి 15 రోజులకొక్కసారి సమీక్షలు నిర్వహిస్తామని, ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు.

 

Tags: Speed up work in Punganur today

Leave A Reply

Your email address will not be published.