-రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మల్లేపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతీ ముచ్చట్లు:
ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి బాధితులకు సత్వర పరిష్కారం చూపడం జరుగుతోందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయం నందు ప్రజాదరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులకు తెలియజేసి బాధితుల సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అధికారులు పేదల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. గతంలో ఎంత వెనుకబడి ఉన్న రాయచోటి నియోజకవర్గం నేడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దెందుకు తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రివర్యులకు అర్జీలు సమర్పించారు.
Tags: Speedy resolution of petitioners through public durbar