Natyam ad

అమ్మకానికి స్పైస్ జెట్

ముంబై  ముచ్చట్లు:

అప్పుల భారంతో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డబ్బును సేకరించేందుకు వాటాను విక్రయించనుంది. నివేదికల ప్రారం.. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ పార్ట్ సేల్ భారతీయ కంపెనీలు, మిడిల్ ఈస్ట్ కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నారు. స్పైస్‌జెట్‌లో అజయ్‌సింగ్‌కు 60 శాతం వాటా ఉంది. స్పైస్‌జెట్‌ను 2015లో మారన్ సోదరుల నుండి అజయ్ సింగ్ కొనుగోలు చేశారు. ఆ సమయంలో కూడా విమానయాన సంస్థ మూసివేత అంచున ఉందిస్పైస్ జెట్ కంటే ముందు, జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా నిధుల సమస్యల కారణంగా మూసివేయబడ్డాయి. ఒకదాని తర్వాత ఒకటిగా విమానయాన సంస్థలు మూతపడడం భారత విమానయాన రంగంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎయిర్‌లైన్ కంపెనీలు మొదట భారీగా ప్రారంభం కాగా, ఆపై అప్పుల భారం ఊబిలో కూరుకుపోతున్నాయి. దీంతో తమ సంస్థలను మూసివేస్తున్నాయి.

 

Post Midle

Tags: Spice Jet for sale

Post Midle