తెలంగాణ గ్రీన్ సిగ్నల్… ఏపీలోనే..

Date:01/06/2020

హైద్రాబాద్. ముచ్చట్లు:

లాక్‌డౌన్ 5 అమల్లోకి వచ్చింది.. జూన్ 30 వరకు కొనసాగనుంది. అలాగే కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయగా.. రాష్ట్రాలు కూడా మరికొన్ని సడలింపులు ప్రకటించాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నో చెబుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రాల మధ్య విచిత్ర పరిస్థితి ఏర్పడింది.రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడూ రాకపోకలు రద్దీగా ఉండేవి.. వేలాది బస్సులు, పదుల సంఖ్యలో రైళ్లు నడిచేవి. లాక్‌డౌన్ తర్వాత సీన్ మారిపోయి చెక్‌పోస్టులు వచ్చేశాయి.

 

 

 

 

 

 

ఇప్పుడు అన్ లాక్ 1.0లో భాగంగా అంతరాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతిఇచ్చినా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ తప్పనిసరంటోంది ఆంధ్ర ప్రదేశ్. తెలంగాణకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకున్నా, ఏపీకి వెళ్లాలంటే మాత్రం ఆంక్షలు తప్పడం లేదు.ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆంక్షలతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ప్రయాణికులు. అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రయాణికులను అనుమతిస్తుండగా.. పాస్ ఉన్నవాళ్లనే ఏపీలోకి అనుమతించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత రాష్ట్రానికి వెళ్లొచ్చిన ఆశగా సరిహద్దులకు వెళ్లిన ఏపీకి చెందిన ప్రయాణికులు నిరాశతో మళ్లీ వెనక్కు వస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

 

 

 

 

 

ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు కచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది అన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఏడు రోజులు సంస్థాగత క్వారంటైన్ లో ఉండి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల దగ్గర ఆంక్షలు కొనసాగుతాయి. ప్రయాణికులు గమనించాలని పోలీసులు ట్వీట్ చేశారు.

 కేరళలోకి నైరుతి రుతుపవనాలు

Tags: Spicy Green Signal …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *