ఇండియాలో ముందుగానే విడుద‌ల‌వుతున్న `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం`

Date:26/06/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం` రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం` సిద్ధ‌మ‌వుతోంది. `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం` చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా విడుద‌ల చేస్తుంది. ఇంగ్లీశ్‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మార్వెల్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాల‌పై క్రేజ్ క్ర‌మంగా పెరుగుతుంది. ఈ సంద‌ర్భంగా… సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ “సూప‌ర్‌హీరో స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం`పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాను జూలై 4న విడుద‌ల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

విద్యుత్ రంగంపై సమీక్ష

Tags: ‘Spider-Man: Far From Home’, pre-released in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *