పుంగనూరులో 12న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం
పుంగనూరు ముచ్చట్లు:
ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిష్టియన్, మైనార్టీల ఆత్మీయ సమావేశం ఈనెల 12న పుంగనూరులో నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహకులు డాక్టర్ మునీంద్రనాయక్ బుధవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఆర్‌ఆర్.కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమం నాగరాజగౌడు, మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోని బడుగుబలహీన వ ర్గాల వారు ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై, తమ సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాలని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో పలువురు ముఖ్యనేతలు పాల్గొంటారని తెలిపారు.

Tags: Spirit gathering of SC, ST, BC, Minorities on 12th at Punganur
