Natyam ad

మదనపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం

మదనపల్లి ముచ్చట్లు:

ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వరకనాథ్ రెడ్డి, మదనపల్లి వైకాపా అభ్యర్థి  నిస్సార్ అహ్మద్ తదితరులు

Post Midle

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

వేమన విగ్రహానికి మంచి స్థలం కావాలని కోరారు, తప్పనిసరిగా మంచి స్థలం చూపిస్తాం.రెడ్డి సంఘం భవనం కోసం ఇప్పటికే ఒక స్థలం కేటాయించాం.సమస్యలు ఏమున్న మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తాం.రాష్ట్రంలో మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.మైనారిటీలు వైసీపీ కి అండగా నిలుస్తున్నారు.అందుకే గతంలో నాలుగు సీట్లు ఇస్తే, ఈ సారి మైనారిటీలకు ఏడు సీట్లు ఇస్తాం.అందరినీ అడుకునేలా మన నాయకత్వం ఉండాలి.సిఎం  వైఎస్ జగన్ సహకారంతో అనేక అభివృద్ధి పనులను చేశాం. మిథున్ రెడ్డి ఎంపీ గా అనిబిసెంట్ కాలేజ్ ను యూనివర్శిటీ చేశారు.మదనపల్లి చుట్టూ హైవే లు నిర్మిస్తున్నాం.ఇవన్నీ శ్రీ మిథున్ రెడ్డి కృషితోనే సాధ్యమయ్యాయి.సిఎం  వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం నుండి మనకు నీరు అందిస్తున్నారు.రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందుతుంది.ఇప్పటికే ఇందుకు సంబందించిన టెండర్లు పూర్తయ్యాయి, సర్వే జరుగుతుంది.

 

 

 

మన ప్రాంతంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం కు శ్రీకారం చుటాం.చంద్రబాబు నాయుడు కోర్టు కు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు.త్వరలో సుప్రీం కోర్టులో ఆ కేసు గెలిచి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాం.మనం అన్ని కులాలను కలుపుకొని ముందుకు సాగాలి.కిరణ్ కుమార్ రెడ్డి చిదంబరం కాళ్ళు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు.రాష్ట్ర విభజనకు సహకారం, జగన్ ను అడ్డుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు.రాజశేఖర్ రెడ్డి నమ్మి కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ ను చేస్తే… ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి శ్రీ వైఎస్ జగన్ ను 16 నెలలు జైలు లో పెట్టారు.తమ్ముళ్ళను పెట్టుకుని హైదారాబాద్ లో ఆఫిస్ ఓపెన్ చేసి కమిషన్లు దందుకున్నాడు.తర్వాత చెప్పులు పార్టీ పెట్టుకుని సొంత తమ్ముడిని కూడా గెలిపించుకులేక పోయారు. మిథున్ రెడ్డి మనందరికీ అండగా నిలవాలి.తంబళ్లపల్లె లో  ద్వరకనాథ్ రెడ్డి ను మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.

 

ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వరకనాథ్ రెడ్డి కామెంట్స్…..

 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి కులానికి మేలు చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.అదేవిధంగా అందరినీ కలుపుకొని మనమంతా ముందుకు సాగాలి.అనవసరమైన విభేదాలు రాకుండా అంతా కలిసి ఎన్నికల కోసం పని చేయాలి. వైఎస్ జగన్ కు మరోసారి భారీ విజయాన్ని అందించాలని కోరుతున్నా.

 

Tags:Spiritual meeting of Reddy Welfare Association at Madanapally

Post Midle