ఎస్వీబీసీలో ధార్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కోసం రూ.50 ల‌క్ష‌ల స్పాన్స‌ర్‌షిప్‌

Date:23/01/2021

తిరుమల ముచ్చట్లు:

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ఒక సంవ‌త్స‌రం పాటు ధార్మిక‌, భ‌క్తిప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేందుకు గాను యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 ల‌క్ష‌లా 55 వేల 120 రూపాయ‌లు స్పాన్స‌ర్‌షిప్ అందించింది.బ్యాంకు ఎండి మ‌రియు సిఈవో   రాజ్‌కిర‌ణ్ రాయ్ సూచ‌న‌ల మేర‌కు తిరుప‌తి డిజిఎం శ్రీ ద‌త్తాత్రేయ వేంక‌టేశ్వ‌ర‌శ‌ర్మ స్పాన్స‌ర్‌షిప్ మొత్తం డిడిని శనివారం తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి   ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.ఈ కార్య‌క్ర‌మంలో యూనియ‌న్ బ్యాంక్ తిరుప‌తి ఎజిఎం   చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, తిరుమ‌ల శాఖ మేనేజ‌ర్  సాంబ‌శివ‌రావు పాల్గొన్నారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Sponsorship of Rs. 50 lakhs for conducting charitable activities in SVBC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *