ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి

-జిల్లా ఎస్పీ సింధు శర్మ
-దివంగత అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి  స్మారకార్ధం జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

Date:29/10/2020

జగిత్యాల  ముచ్చట్లు:

క్రీడలతో స్నేహ భావం పొందడంతో పాటు ఫిట్ నెస్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి, పని ఒత్తిడి నుండి రిలీఫ్ అవడానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎస్పీ సింధు శర్మ  తెలిపారు.దివంగత అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి  స్మారకార్థం జిల్లా పోలీస్ శాఖ అధికారులకు, సిబ్బందికి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్నిగురువారం పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ గత సంవత్సరం దివంగత అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా మొదటి స్పోర్ట్స్ మీట్  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని, దురదృష్టవశాత్తు కరోనా బారినపడి అదనపు ఎస్పీని కోల్పోవడం జరిగిందనన్నారు.కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని నాన్ కాంటాక్ట్ ఆటలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని ఇందులో భాగంగా షార్ట్ ఫుట్ రన్నింగ్, షటిల్, లాంగ్ జంప్ వంటి ఫిట్ నెస్ ఇంప్రూవ్ చేసుకొనే ఆటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఈ స్పోర్ట్స్ మీట్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనడం ద్వారా పోలీస్ అధికారులకు, సిబ్బంది స్నేహభావం పెంపొందుతుందని, మన ఫిట్ నెస్ పైన ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని,అంతే కాకుండా పని ఒత్తిడి నుండి కొలుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేష్ కుమార్ , డీఎస్పీ లు వెంకటరమణ, గౌస్ బాబా, ప్రతాప్,  జిల్లా ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు మృతి

Tags: Sports can help a lot in improving fitness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *