Date:30/11/2020
ఐపిఎస్ అధికారి సి.వి. ఆనంద్
హైదరాబాద్ ముచ్చట్లు
మనోల్లాసం తో పాటు శారీరక దృడత్వానికి క్రీడలు ఎంతో దోహద పాడుతాయని ఐపిఎస్ అధికారి సి.వి. ఆనంద్ అన్నారు. హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసిసియేషన్(హోటా) ఆద్వర్యం లో 2020-21 సంవత్సరం1 వ టోర్నమెంట్ క్రీడలను బాయింపల్లి లోని సూర్య టెన్నిస్ ఫౌండేషన్ వద్ద ఐపిఎస్ అధికారి సి.వి. ఆనంద్ ముఖ్య అతిథిగా, మిస్టర్ సాకేత్ మైనేని ఇండియన్ డేవిస్ కప్ ప్లేయర్ అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా అవసరమైన అన్ని కోవిడ్ జాగ్రత్తలు పాటించారు.ఈ సందర్బంగా సివి ఆనంద్ మాట్లాడుతూ శారీరక దూరాన్ని కాపాడుకోవడమే కాదు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 నుండి కాపాడుకోడాడికి ప్రతి ఒక్కరు ముసుగులు ధరించాలని, అందుకు సంబంధించి తగిన ప్రచారం కూడా ముఖ్యమని అందరినీ హెచ్చరించారు.అనంతరం గౌరవ అతిథిగా హాజరైన సాకేత్ మైనేని ఇండియన్ డేవిస్ కప్ ప్లేయర్ మాట్లాడుతూ ఈటోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి క్రీడా కారుడు తమ నైపున్యతను ప్రదర్శించి విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఏఐఎస్టిఏ కార్యదర్శి బుద్ధ రాజు తన విస్తారమైన అనుభవంతో అందరికీ క్రీడల యొక్క ప్రాముఖ్యం వాటి ప్రాదాన్యత గూర్చి జ్ఞానోదయం చేశారు. అనంతరం హోటా అధ్యక్షుడు నంద్యల నరసింహరెడ్డి మాటాడుతూ ఈ టోర్నమెంట్, వరుసగా రెండవ సంవత్సరమని తెలిపారు. ఇతర టెన్నిస్ అసోసియేషన్లు 5 నుండి 7 వరకు జరిగే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు కాని ఈ టోర్నమెంట్ కేవలం 2 నుండి 3 రోజులు మరియు సెలవు దినాల్లో మాత్రమే ఉంటుందని తెలిపారు. బిజీ ఉద్యోగులు, ఐటి ప్రో ఎసెన్షియల్స్, బిజినెస్ మెన్ మొదలైన క్రీడాకారులు పాల్గొనడానికి ఇది తగిన అవకాశమన్నారు. ఈ టెన్నిస్ క్రీడల్లో 30+, 40+, 50+, & 60+ సంవత్సరాల వయసు గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ క్రీదోత్సవాలు పండుగ వాతావరణం లో ఆడవచ్చు మరియు ఆనందించవచ్చునన్నారు.హోటా ఉపాధ్యక్షుడు జె. వి. రమణ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రవీణ్, కోటి రెడ్డి ఉపాధ్యక్షులు మరియు సదాశివ రెడ్డి ట్రెజర్, ఎగ్జిక్యూటివ్ దర్శకులు అశోక్ స్వామినాథన్, మనీష్, కె.వి.ఎన్. మూర్తి తో పాటు 150 మంది క్రీడా కారులు పాల్గొన్నారు.
కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోవద్దు
Tags:Sports contribute a lot to relaxation and physical fitness