శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు

తిరుపతి ముచ్చట్లు:

ఎన్.బి.ఎ గుర్తింపుగల టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా (DPH) కోర్సులో ప్రవేశానికి డిసెంబరు 13వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు.

ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ ఉతీర్ణత పొందిన ఆసక్తి గల విద్యార్థినులు విద్యార్హత సర్టిఫికెట్ల ఒరిజినల్ మరియు 3 సెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు.

ప్రభుత్వం నిర్ణయించిన కోర్సు ఫీజుతో విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తారు. సీట్లు పరిమితంగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 9299008151, 9247575386, 8978993810 నంబర్లను సంప్రదించగలరు.

Tags: Spot Admissions for Pharmacy Diploma Course in Sri Padmavathi Women’s Polytechnic College

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *