Sprinkling mud on the CM

సీఎంపై బురద చల్లుతున్నారు

Date:23/09/2020

అమరావతి ముచ్చట్లు

ఆలయంలో డిక్లరేషన్ విషయంలో  విపక్షాలు ఆరోపణలపై , తెలుగు అకాడమీ చైర్మన్, వైసీపీ  నేత నందమూరి లక్షి పార్వతితిరుమల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు అంత పని పాట లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. డిక్లరేషన్ పేరుతో  అనవసరంగా ప్రభుత్వంపై సీఎంపై బురద చల్లుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు విపక్షాలకు పట్టడం లేదు. మతం పేరుతో  ప్రజలని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. చెన్నారెడ్డిని దింపేదుకు  మత పరమైన అల్లర్లు సృష్టించే వారు కాంగ్రెస్ నేతలని విమర్శించారు. 1989-1994మధ్యలో ఇలాగే పాత బస్తీలో అల్లర్లు చేశారు. కాంగ్రెస్ కల్చర్ లో ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారో అలాగే ఇప్పడు మతం పేరుతో రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ నుండి వచ్చారు కాబట్టి  కాంగ్రెస్ కల్చర్ ఇంకా చంద్రబాబుకీ పోలేదు. ఇప్పడు టీటీడీ విషయంలో బీజేపీ టీడీపీ  నేతలు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు టీడీపీ నేతలు మాట్లాడినట్లే మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మత పరంగా రాజకీయం చెయ్యడానికి మతాన్ని నమ్ముకున్న వ్యక్తి కాదు. హిందూ సంప్రదాయం చంద్రబాబు ఎప్పుడు పాటించారో చెప్పాలి. హిందూ మతం పట్ల చంద్రబాబు నమ్మకం ఉంటే ప్రజలకు నిరూపించాలని ఆమె అన్నారు. టీటీడీ కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ముఖ్యమంత్రికి డిక్లరేషన్ వర్తిస్తుందా. సో నియా గాంధీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా.

 

చంద్రబాబు ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు.  వైస్సార్,జగన్మోహన్ రెడ్డి మతం  పాటించాలని ఎప్పుడు చెప్పారు. కాషాయం వేసిన మూర్ఖులు అంతా ఒక చోట చేరారు. హిందూ అనేది ఒక మతం కాదు,హిందూ అనేది ఒక ధర్మం. మతం  పేరు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోకేష్ ని ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం  భువనేశ్వరి క్షుద్ర పూజలు చేసిందని అన్నారు. అమ్మవారి దేవాలయంలో అర్ధ రాత్రి క్షుద్ర పూజలు చేయించిన దుర్మార్గురాలు చంద్రబాబు భార్య. బీజేపీకి అస్సలు చిత్తశుద్ధి ఉంటే గతం సంవత్సరంలో కూడా జగన్  పట్టు వస్త్రాలు సమర్పించారు అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తారు. భువనేశ్వరి,లోకేష్ కోసం చేసిన క్షుద్ర పూజల గురించి బీజేపీ నేతలు అడగాలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంపై సర్వ హక్కులు ఉంటాయి. రాజు విష్ణువుతో  సమానమని పురాణాలు చెప్తున్నాయి. రాజుకు మతాలు అంటగట్టడం దారుణం. బీజేపీ,టీడీపీ నేతలు డిక్లరేషన్ గురించి వాస్తవాలు మాట్లాడాలి. జగన్ ఎప్పుడో హిందువుగా మారారు. గతంలో  స్వరూపానంద జగన్ మోహన్ రెడ్డిని తీసుకొని  గంగా నదిలో పూజలు చేయించారని ఆమె గుర్తు చేసారు.

 

అప్పుల్లో కార్పోరేషన్ 

Tags:Sprinkling mud on the CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *