హిమాలయాలలో గూఢచారి షూటింగ్  

Date:14/05/2018
సినిమా ముచ్చట్లు:
నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా చాటుకున్న అడివి శేష్ హీరోగా వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం “గూఢచారి”. చివరి షెడ్యూల్ గా ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహించే ఓ మహానది పై నిర్మించిన ఎత్తైన  మిలిటరీ వంతెన పై చిత్రీకరిస్తున్నారు. అడివి శేష్ తోపాటు ప్రకాష్ రాజ్ మరియు ఇతర నటులు షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ‘గూఢచారి’ అమెరికా లోని మౌంట్ రైనియర్ మరియు ఇతర అందమైన లొకేషన్ లలో చిత్రీకరించబడింది. న్యూ ఢిల్లీ, పూణే, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడలలో సముద్రం మధ్యలో మరియు మంచు పర్వత ప్రాంతాలలో షూటింగ్ చేసారు. స్పై థ్రిల్లర్ గా వస్తున్నా ఈ చిత్రంతో శశికిరణ్ తిక్క దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో సుప్రియ యార్లగడ్డ మళ్ళీ తెలుగు తెర పై కనిపించనున్నారు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు: శశికిరణ్ తిక్క
కథ: అడివి శేష్
నిర్మాత: అభిషేక్ నమ, టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
సంగీతం: శ్రీచరణ్ పాకాల
మాటలు: అబ్బూరి రవి
ఛాయాగ్రహకుడు: షానిల్ డియో
ఎడిటర్: గ్యారీ బి.హెచ్.
ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు
Tags:Spy shooting in the Himalayas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *