తెలుగువారి లోగిల్లో శ్రావణ శోభ..
కాకినాడ ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లాలో అమ్మవారి ఆలయాలన్నీ శ్రావణ వరలక్ష్మీ వ్రత శోభను సంతరించుకున్నాయి. వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించారు అర్చకులు. కడియం మండలం కడియపులంక శ్రీముసలమ్మ అమ్మవారు. శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ధన లక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. ఈ మేరకు అమ్మవారి అలంకరణ కోసం 31 లక్షల 25 వేల రూపాయల నూతన కరెన్సీ నోట్లను ఉపయోగించారు.సిరులను కురిపించే ధనలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్నారు కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని చూసి ఎందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. తాము ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని అర్చకులు చెప్పారు. అంతేకాదు ఇలా దేశం సుభిక్షంగా ఉండడం కోసం తాము ఇలా అమ్మవారిని ప్రార్ధిస్తున్నామని అర్చకులు తెలిపారు. స్థానిక భక్తులు నివాసాల్లో వరలక్ష్మి వ్రత పూజలు అనంతరం మహిళలు స్థానిక అమ్మవారు ఆలయాలకు క్యూ కట్టారు.శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసం.
ముఖ్యంగా శ్రావణ మాసంలో మహిళలు వరలక్ష్మీ పూజకు , మంగళ గౌరీ పూజకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. లక్ష్మీదేవి అంశంగా భావించే వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలోని పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. భక్తిశ్రద్దలతో కొలిచే భక్తుల కోరికలను తీవ్ర కల్పవల్లిగా మహిళలు భావిస్తారు.వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మహిళలకు ఎంతో ఉత్సాహం వస్తుంది. సాంప్రదాయ దుస్తులతో సాక్ష్యాత్తు లక్ష్మీదేవి కొలువై ఉందా అనే విధంగా అలంకరించుకుంటారు. ప్రతి ఇంటా ఎంతో సందడి నెలకొంటుంది. శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వచ్చే వరలక్ష్మీ వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన పేరి ఫణి కుమారి వరలక్ష్మీ వ్రతం పూజకు సంబంధించి సొంతంగా విగ్రహాలను తయారు చేయడంతో పాటు వివిధ డెకరేషన్ ఐటమ్స్ ను రూపొందించారు. అష్టలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలతో పాటు ప్రధాన అమ్మవారి విగ్రహాన్ని తయారుచేసి పూజ కు కొలువు తీర్చారు. అరటి చెట్లకు అరటి పళ్ళు గెల ను కృత్రిమంగా తయారుచేసి అలంకరించారు.
Tags: Sravana Shobha in Telugu people..
