శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా ‘అల్లూరి’ సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

హైదరాబాద్ ముచ్చట్లు:

హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఓ పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌ ‘అల్లూరి’ లో నటిస్తున్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. చిత్రబృందం తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రెండో వారం నుంచి దసరా సెలవులు ఈ చిత్రానికి కలసిరానున్నాయి. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీవిష్ణు చేతిలో ఈటె పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించారు. వెపన్ నుండి రక్తం కారడం కూడా పోస్టర్ లో ఇంట్రస్టింగా వుంది. అల్లూరి అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది.

 

 

ఇందులో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ పొటెన్షియల్ కంటెంట్ తో సినిమాపై అంచనాలను పెంచేసింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.  తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు.

 

Tags: Sree Vishnu, Pradeep Verma, Lucky Media ‘Alluri’ Releases Worldwide on September 23

Leave A Reply

Your email address will not be published.