Sri Agastheeswara Swamy Temple in Dakshinakshi

దక్షిణకాశిగా విరాజిల్లుతున్న శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయం

– 16 నుంచి ఉత్సవాలు ప్రారంభం

Date:14/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ పంచాయతీ కొండలపై వెలసిన శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్దం చేశారు. ఈనెల 16 నుంచి 25 వరకు 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో రథోత్సవం నాడు వేల సంఖ్యలో భక్తులు హాజరై, రథంపై ఉప్పు, మిరియాలు చల్లి వెహోక్కులు చెల్లిస్తారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని పూజలు నిర్వహిస్తారు. ఆలయ కమిటి ఉత్సవాలను పకడ్భంధిగా నిర్వహించనున్నారు. అలాగే పట్టణంలోని యాబైరాళ్ల వెహోరవేశ్వరుడు, కోనేటి వద్ద గల శ్రీ కాశివిశ్వేశ్వరస్వామి ఆలయం, ప్యాలెస్‌లో గల సోమేశ్వరాలయం, భీమగానిపల్లెలో గల భీమేశ్వరాలయం, కీలకీరి గ్రామంలో గల శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి పూజలకు సర్వం సిద్దం చేశారు.

ఆలయ చరిత్ర …..

పుంగనూరు జమిందార్లు ఈ ఆలయ నిర్వహణకై వందలాది ఎకరాల భూములను విరాళంగా ఇచ్చారు. నేడు ఆలయ భూములను దేవాదాయశాఖ స్వాధీనం చేసుకొన్నది. పూజారులకు జీతం ఏర్పాటు చేసినది. ఒక వైపు నుంచి కొండపైకి చక్కటి ఎక్కుడు దారి ఉంది. చోళరాజుల పాత రాజధాని నగరము(జయకొం చోళపురము) కొత్తకోటకు , కొండకు మధ్యగల స్థలంలో ఉండేది. ఇక్కడ పొలాల్లోఅందుకు సాక్ష్యాలు ఉన్నాయి. సుమారు ఒక కిలో మీటరు పొడువు అంతే వెడల్పు ఉన్న విశాల స్థలంలో ఎన్నో శి•లాలయాలు, 50 అడుగుల ధ్వజస్తంభము , ప్రాచీన సమాధులు, మట్టి పాత్రలు , ఇతరలోహ వస్తువుల లభ్యత , నేలస్వభావము అందుకు బలాన్నిస్తున్నాయి. అగస్తీశ్వరాలయం కొండశిఖరాగ్ర బాగమున విశాలమైన ప్రదేశంలో నిర్మించబడినది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధానదైవము, అగస్త్యీమహాబుషి పూజించిన శివలింగాన్ని ఇక్కడ రాజులు తెచ్చి ప్రతిష్ఠించారని, అందుకే ఈ ఆలయానికి అగస్తీశ్వరాలయమని పేరు వచ్చిదని నానుడి. అగస్త్యుడు భూలోక సంచార సమయంలో స్వయముగా స్వామిని ప్రతిష్ఠించినారనికూడా చెబుతారు. ఈ కొండకు మూడు వృత్తాకారపు కోటలున్నాయి. ఇది ఒకప్పుడు గిరి దుర్గము ఉండేది. రెండు కొండలకు మధ్య భాగమున కోనేటికి వాయ్యువ్యంగా పాతనిర్మాణాలు, రోలు దిమ్మెలు, నిర్మాణ సామాగ్రీ శి•లమై చెల్లాచెదురుగా పడివుంది. నగిరిండ్లనే గృహ నిర్మాణాలు ఉండేవని కొందరు తెలిపారు. ఆలయం చుట్టు నాలుగు దోనలున్నాయి. వీటిలో ఎల్లప్పుడు నీళ్లు ఉంటాయి. చిన్న చిన్న 5 కొండగుట్టలపై 14 మలుపులు గలిగిన రహదారి వేయబడింది. ఈఆలయానికి ఒకప్పుడు సుమారు 5000 ఎకరాల భూమిని మాన్యంగా ఉండేదని తెలుస్తోంది. గర్భగోపురం చుట్టు 3 యేళ్ల మేర భూములన్ని దేవతామాన్యంగా ఉండేవి. 21 రోజులు ఉత్సవాలు జరుగుతుండేవి. అవి ఈనాటికి 11 రోజులకు జరిపిస్తున్నారు.

ఆలయంలో….

గర్భగుడిలో అగస్తీశ్వరస్వామి ఉన్నారు. కొండపై సుబ్రమణ్య ఆలయం, వినాయకాలయం, చౌడేశ్వరి, పార్వతి ఆలయాలు ఉన్నాయి. కాశీవిశ్వేశ్వరాలయం, చండీశ్వరాలయం, వీరభద్రాలయం, భద్రకాళి ఆలయాలున్నాయి.ప్రదక్షిణ మండపం చక్కటి శిల్పకళతో కూడిన స్తంభాలపై ఉంది. తమిళ, తెలుగు శాసనాలు అనేకం ఉన్నాయి. వెహోదటి శాసనం క్రి.శ 1192 -1193 నాటి వెహోదటి కులోత్తుంగ వీరరాజేంద్రుడిది. తరువాత క్రి.శ 1329లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గంగవంశరాజై (ఉత్తమచోళ గంగపుడమి దేవకుమారుడు) సెల్వగంగరాజు, అతని పుట్టపుమహిషి సెల్వగంగ విగ్రహ ప్రతిష్ఠగావించినట్లు ఇంకోశాసనంలో స్వామికి స్వర్ణాభరణాలను బహుకరించినట్లు , మరో శాసనంలో ఆలయ నిర్వహణకు గాను ప్రకటించిన భూమాన్యములు ఉన్నాయి.

గౌనిమండపం….

ఆలయమునకు నైరుతిలో 16 స్తంభములపై నిర్మించిననాలుగంతస్తుల గెనోళ్ల మండపం చెప్పుకోదగినది. దక్షిణ ప్రవేశంగా పైకి ఎక్కుటకు 18 రాతి మెట్లు నిర్మించారు. ప్రతి స్తంభము చిత్రములతో జీవమున్నవా అనిపించేటంత కళతో నిర్మించారు. మఠపంలోక్రిందిభాగన తొమ్మిది చిత్రములు చెక్కి రంగులు వేయబడినవి. ఆశిల్పములు చూడదగినవి.

ఆలయ అభివృద్ధికి మంత్రి కృషి….

అగస్తీశ్వరాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి లు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆలయానికి రహదారులు, విద్యుదీకరణ చేపట్టారు. అలాగే ఆలయానికి నూతన రథాన్ని ఏర్పాటు చేయించారు. సుమారు రూ.2 కోట్లతో ఆలయానికి మరమ్మతులు చేసి సుందరంగా అలంకరించారు. వీటీతో పాటు ఆలయ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అగస్తీశ్వరాలయం పర్యాటక కేంద్రంగా మారనున్నది.

ఆటోబోల్తా మహిళ మృతి

Tags: Sri Agastheeswara Swamy Temple in Dakshinakshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *