Natyam ad

ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు గురువారం ఉదయం శ్రీ అల‌మేలుమంగ అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులను అనుగ్ర‌హించారు.అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.పల్లకీలో మోహిని అలంకారంఅమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్స‌వం నిర్వ‌హిస్తారు.

గ‌జ వాహ‌నం

Post Midle

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురువారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేష‌మైన గ‌జ వాహ‌నంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో  వీరబ్రహ్మం దంపతులు, ఆగమ సలహాదారులు  శ్రీనివాసచార్యులు, విఎస్వో  మనోహర్, ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాథం, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు  బాబు స్వామి, సూపరిండెంట్  శేషగిరి, ఆర్జిత ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.

 

Tags:Sri Alamelumanga in Mohini decoration on palanquin

Post Midle

Leave A Reply

Your email address will not be published.