శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంటేశ్వర స్వామి నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
భక్తులు దర్శించుకునేలా చేస్తాం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీకాళహస్తి ఊరందూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదోయుక్తంగా నిర్వహించారు. పురాణ ప్రసిద్ధమైన నీలకంటేశ్వర స్వామి ఆలయానికి త్వరలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తు ఆలయ ప్రాచుర్యాన్ని కి విశేష కృషి చేస్తున్నామని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయం ఊరందరు గ్రామంలో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయ జీర్ణోధారణ ఆధునికరణ పనులను 40 లక్షలతో చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో ఆలయ ఆధునీకరణ చేపట్టారు . ఈ పనుల్లో భాగంగా ఆలయ ఆధునీకరణ పనులు చేపట్టి ధ్వజస్తంభం కూడా దెబ్బతిని ఉండడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు.

ఈ మేరకు ఆలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్త్ర యుక్తంగా చేపట్టారు. దేవస్థాన ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాంప్రదాయ పద్ధతిలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదోయుక్తంగా నిర్వహించారు. భక్తులు ధ్వజస్తంభాన్ని నిలబెడుతూ శివనామ స్మరణ ల తో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, ఏఈఓ లోకేష్ రెడ్డి, సూపర్డెంట్ శ్రీహరి, ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ వేణుగోపాల్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ, స్థపతి కుమార్, వేద పండితులు సుగమయ శాస్త్రి, శ్రీనివాస శర్మ, పరిచయరుకులు చందు శర్మ, ఆలయ పూజారి జనార్ధన్ శర్మ, మరియు గ్రామ పెద్దలు నీలకంఠారెడ్డి,చంద్రారెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, సుబ్బరాయ మొదలయ్య, రఘురామయ్య, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Sri Annapurna Sametha Sri Neelakanteswara Swamy’s New Flagpole Pratistha
