భక్త సంద్రంగా మారిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం
చౌడేపల్లి ముచ్చట్లు :
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి నెలకొన్నది.ఉదయం నాలుగు గంటలకే అర్చకులు అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించి, దర్శన వసతి కల్పించారు. వరుస సెలవులు రావడంతో సుమారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఈవో చంద్రమౌళి పాలకమండలి మాజీ సభ్యుడు వెంకటరమణారెడ్డి, గండి ఆంజనేయస్వామి ఆలయ ఛైర్మన్, ఈవో లు అమ్మవారిని దర్శించుకున్నారు.క్యూలైన్లను సందర్శిస్తూ ప్రతి ఒక్కరికి సులభతరంగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు.సుమారు మూడు గంటల సమయం క్యూలైన్లోనే ఉంటూ భక్తుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు.భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయం వద్ద కాంట్రాక్టర్లు పొందిన గుత్తేదారులు అమ్మకాలు చేయాలని ఆదేశించారు.భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా సిబ్బంది కానీ కాంట్రాక్టర్లు గానీ ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సోమల మల్లికార్జున్రెడ్డి, లడ్డు రమణ, గిరి, గంగిరెడ్డి, కో ఆప్షన్ మాజీ సభ్యుడు గంగిరెడ్డి,, సురేందర్ రెడ్డి, మునికృష్ణ, రెడ్డప్ప, డిష్
సూరి తదితరులు పాల్గొన్నారు.

Tags:Sri Boyakonda Gangamma Temple has become a devotee’s shrine
