Natyam ad

లలిత త్రిపుర సుందరి అలంకారంలో శ్రీ చౌడేశ్వరి దేవి

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని గుంతలపేటలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారు శుక్రవారం లలిత త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరా ఉత్సవాలలో భాగంగా అన్ని శక్తీ దేవాలయాలలో దసరా ఉత్సవాలు వివిధ అలంకారాలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామసముద్రంలోని శ్రీ దుర్గమ్మ ఆలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, శ్రీ లక్ష్మీ జనార్దన్ స్వామి ఆలయం, గుంతయంబాడి, గంపనపల్లి లోని శ్రీ చౌడేశ్వరి దేవి, తిరుమలరెడ్డిపల్లిలోని మారెమ్మ ఆలయాల్లో దసరా వేడుకలు నిర్వహించారు.
వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఆలయాలలో ప్రతిరోజు దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వివిధ అలంకారాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. రాత్రి ఆలయాల వద్ద సాంస్కృతి కార్యక్రమాలలో భాగంగా భజన కార్యక్రమాలు నిర్వహించారు.

 

Post Midle

Tags: Sri Chowdeshwari Devi in Lalita Tripura Sundari Alankaram

Post Midle